Mon Dec 23 2024 01:09:38 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. బాలకృష్ణ సంచలన ప్రకటన
హిందూపురంలో బాలకృష్ణ ఇరవై నిమిషాలు మౌనదీక్ష చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు
హిందూపురంలో బాలకృష్ణ ఇరవై నిమిషాలు మౌనదీక్ష చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. హిందూపురంలో తమ పార్టీ కౌన్సిలర్ లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. తాను కూడా రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అర్థరాత్రి జీవోలు ఇచ్చి ప్రజలను విడదీస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై బాలకృష్ణ విరుచుకుపడ్డారు.
అన్ని అర్హతలున్నా....
హిందూపురం జిల్లా కేంద్రానికి అన్ని విధాలుగా అర్హత ఉందని బాలకృష్ణ తెలిపారు. కావాలనే హిందూపురాన్ని వేరు చేసి చూస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 31 మంది వైసీపీ కౌన్సిలర్లను గెలిపించినా ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తుందని బాలకృష్ణ ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి పేరు సత్యసాయి జిల్లాగా పెట్టాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. అన్న క్యాంటిన్లు ఎందుకు ఎత్తివేశారని ఆయన నిలదీశారు. ఈ వైసీపీ నేతలకు అభివృద్ధి తప్ప అంతా కావాలన్నారు. ఒక పరిశ్రమను కూడా ఈ ప్రభుత్వం తేలేకపోయిందాన్నారు. కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెడితే టీడీపీ ప్రభుత్వం కొనసాగించిదని ఆయన గుర్తు చేశారు.
Next Story