Tue Dec 24 2024 16:50:04 GMT+0000 (Coordinated Universal Time)
హెలికాప్టర్ లో సాంకేతిక లోపం... బాలయ్య ఇంకా ఒంగోలులోనే
వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రయాణించే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది
వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రయాణించే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరిన బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పదిహేను నిమిషాలకే ఒంగోలుకు చేరుకుంది. హెలికాప్టర్ లో బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కనిపించింది.
నిన్న ఒంగోలుకు వచ్చి...
ప్రస్తుతం ఒంగోలులోనే నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఏటీసీ నుంచి వచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నారు. నిన్న రాత్రి వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ పాల్గొన్నారు. రాత్రికి ఒంగోలులోనే బస చేశారు. కానీ ఉదయం 9 గంటలకు బయలుదేరిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం గుర్తించడంతో అక్కడే నిలిపివేశారు. తిరిగి ఎప్పుడు బయలుదేరతారన్నది మరికాసేపట్లో తెలియనుంది.
Next Story