Sat Nov 23 2024 05:44:04 GMT+0000 (Coordinated Universal Time)
మద్దతుదారులతో బాలినేని కీలక భేటీ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ?
తన తదుపరి రాజకీయ భవిష్యత్, కార్యాచరణపై మద్దతుదారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా
విజయవాడ : ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏపీ ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం కొత్త కేబినెట్ లో ఆయనకూ స్థానం ఉంటుందని బాలినేని సహా.. మద్దతుదారులంతా ఆశించారు. కానీ.. మంత్రి పదవి రాకపోవడంతో బాలినేని ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను బుజ్జగించేందుకు నిన్న సజ్జల, సామినేని ఉదయభాను విజయవాడలోని నివాసానికి వెళ్లారు. ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరగా.. జిల్లా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలని బాలినేని వారికి చెప్పినట్లు వార్తలొచ్చాయి.
తాజాగా ప్రకాశం జిల్లా వైసీపీ నేతలంతా బాలినేని నివాసానికి చేరుకున్నారు. మద్దతుదారులు, అనుచరులతో బాలినేని కీలక భేటీ నిర్వహించారు. తన తదుపరి రాజకీయ భవిష్యత్, కార్యాచరణపై మద్దతుదారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. బాలినేని కూడా ఆ బాటలోనే వెళ్తారని సమాచారం. తల్లితరపు బంధువు కావడంతోనే జగన్ తనను దూరం పెట్టినట్లు బాలినేని అనుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారుతారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story