Sun Dec 22 2024 18:38:53 GMT+0000 (Coordinated Universal Time)
బనానా రైలు నేడు ప్రారంభం
రాయలసీమ నుంచి బనానా రైలు నేడు ప్రారంభం కానుంది. తాడిపత్రి నుంచి ప్రారంభించనున్నారు
రాయలసీమ నుంచి బనానా రైలు నేడు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. రాయలసీమలో ఉత్పత్తి అయిన అరటిపండ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
తాడిపత్రి నుంచి...
దీనిని బనానా రైలుగా పిలుస్తున్నారు. నేడు తాడిపత్రి నుంచి ముంబయి కి అరటిపండ్లతో ఈ బనానా రైలు బయలుదేరి వెళ్ల నుంది. ముప్ఫయి నాలుగు వ్యాగన్లలో 680 మెట్రిక్ టన్నుల అరటిపండ్లను ఈ రైలు ద్వారా ఎగుమతి చేయనున్నారు. దీంతో అరటి తోటల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story