Wed Apr 16 2025 16:49:10 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దైంది

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దైంది. హైదరాబాద్-గన్నవరం ఫ్లైట్ 4 గంటలు ఆలస్యం కావడంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు. వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్‌ను ఇటీవలే ఆ పదవి నుండి తొలగించారు. దీంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియమితులయ్యారు. ఏపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జిగా బండిని నియమిస్తారని ప్రచారం జరుగుతుండగా విజయవాడ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఆయన ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించనున్నట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల ఓటర్ల నమోదు ప్రక్రియ బాధ్యతలను పార్టీ నాయకత్వం ఆయనకు అప్పగించింది. మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఏపీలో బండిసంజయ్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఏపీకి చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో ఓటరు నమోదుకు బాధ్యత వహిస్తారు.
Next Story