Tue Dec 24 2024 20:12:38 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ నందిగాంకు ఫోన్ లో బెదిరింపులు
బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ బాబుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ బాబుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫో్న్ చేసి నందిగాం సురేష్ ను బెదిరించారు. దీంతో ఆయన పీఏ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబరు ఆధారంగా సదరువ్యక్తిని గుర్తించారు.
బాబూరావు...
బాబూరావు అనే వ్యక్తి నందిగాం సురేష్ కు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే బాబూరావు మాత్రం ఎంపీయే తనను బెదిరించారని చెబుతుండటం విశేషం. ఈ కేసులో విచారణ జరుగుతుంది.
Next Story