Mon Nov 25 2024 15:03:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వారికి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులనుఅనుమతించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మద్యం దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించినా, వాటిని పెట్టేందుకు సహకరించినా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.
జరిమానాతో పాటు...
బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు తొలి విడత ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.రెండోసారినిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ ను రద్దు చేయడానికి వెనకడబోమని కూడా చంద్రబాబు తెలిపారు. ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
Next Story