Mon Dec 23 2024 15:41:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం
భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించనున్నారు
భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించనున్నారు. సంక్రాంతి పండగ తర్వాత పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ లో బలం పెంచుకునే యత్నంలో భాగంగా ఏపీలో పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రారంభించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ నేతలు పోటీ చేయాలని నిర్ణయించారు.
సంక్షేమ పథకాలను...
తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేస్తామన్న హామీలతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఏపీ పార్టీ వ్యవహారాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా త్వరలో ప్రారంభించనున్నారని తెలిసింది.
Next Story