Sat Dec 21 2024 00:09:16 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి బీజేపీ పాదయాత్ర
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ బీజేపీ నేటి నుంచి పాదయాత్ర చేపట్టనుంది.
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ బీజేపీ నేటి నుంచి పాదయాత్ర చేపట్టనుంది. మనం - మనం అమరావతి పేరుతో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం పది గంటలకు అమరావతి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉదయం 10 గంటలకు ఉండవల్లిలో ప్రారంభించనున్నారు.
29 గ్రామాల్లో....
మొత్తం 29 గ్రామాల్లో ఈ పాదయాత్ర జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యో రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ సాగుతున్న ఈ యాత్రలో జాతీయ స్థాయి నాయకులు కూడా పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి గ్రామంలో రాజధాని అవసరాన్ని తెలుపుతూ ఈ యాత్ర కొనసాగుతుందని వారు చెబుతున్నారు.
Next Story