Mon Dec 23 2024 09:27:47 GMT+0000 (Coordinated Universal Time)
కన్నా కామెంట్స్ పై సోము ఏమన్నారంటే?
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధ్కక్షుడు సోము వీర్రాజు స్పందించారు
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధ్కక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తమ పార్టీలో ఆయన పెద్దలని, ఆయన వ్యాఖ్యలపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని సోము వీర్రాజు తెలిపారు. ఆయన అన్న సందర్భం ఏమిటో తనకు తెలియదన్నారు. ఆయనేదో అన్నారని తాను అన్నింటికీ స్పందించబోనని సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర పథకాలను కూడా జగన్ తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
చంద్రబాబు కలవడాన్ని..
పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలవడాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు హయాంలోనూ అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండు పార్టీలు అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయికపై మీడియా చేస్తున్న రాద్ధాంతమేనని ఆయన కొట్టిపారేశారు. రాజమండ్రిలో అమరావతి రైతులపై దాడిని తాను ఖండిస్తున్నానని తెలిపారు.
Next Story