Tue Apr 22 2025 02:41:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో బీజేపీ నిరసనలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు భారతీయ జనతా పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్ లో నేడు భారతీయ జనతా పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. వినాయక మండపాల సంఖ్య కుదింపుపై అసంతృప్తి తెలియచేయనున్నారు. వినాయక మండపాలను తగ్గించడంపై ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
మండపాల సంఖ్యను...
గణేష్ మండపాల సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా తగ్గించాలన్న కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. దీంతో ఈరోజు బీజేపీ కార్యకర్తలు అన్ని తహసిల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించాలని సోము వీర్రాజు పిలుపు నిచ్చారు.
Next Story