Sat Dec 28 2024 10:42:45 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కడపలో రాయలసీమ రణభేరి
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు కడపలో భారతీయ జనతా పార్టీ సభను ఏర్పాటు చేసింది.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు కడపలో భారతీయ జనతా పార్టీ సభను ఏర్పాటు చేసింది. రాయలసీమ రణభేరి పేరిట ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఈ సభను బీజేపీ ఏర్పాటు చేస్తుండటం విశేషం. గత మూడేళ్లుగా రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, వనరులను వినియోగించుకోకుండా ప్రభుత్వం సీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఈ సభలో బీజేపీ నేతలు నిలదీయనున్నారు.
కేంద్రం నిధులను...
దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా వినియోగించడం లేదన్న ఆరోపణలు చేయనున్నారు. ముఖ్యమంత్రి సొంత ప్రాంతానికే అన్యాయం చేస్తున్నారని ఈ సభ ద్వారా బీజేపీ నేతలు ప్రజలకు తెలియజేయనున్నారు. ఈ కార్కక్రమంలో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేంద్ర నేతలు కూడా పాల్గొనే అవకాశముంది.
Next Story