Sun Dec 22 2024 11:56:23 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఏపీలో బీజేపీ మరింత బలోపేతానికి కృషి
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి కోరారు
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి కోరారు. బీజేపీ గెలవని రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతానికి పార్టీ అగ్రనాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.
సిద్ధాంతాలతో...
బీజేపీ ఒక సిద్ధాంతాలతో పనిచేసే పార్టీ అని అన్నారు. ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తుందని తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. కార్యకర్తలే బీజేపీకి బలమన్న పురంద్రీశ్వరి ఆంధ్రప్రదేశ్ లో 37 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ నేతలు అరవింద్ మీనన్, సిద్ధార్ధనాధ్ సింగ్ తో పాటు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
Next Story