Mon Dec 23 2024 13:40:17 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యేక హోదాపై సోము వీర్రాజు కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ నెల 17వ తేదీన జరిగే సమావేశంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపైనే చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక హోదాపై చర్చ ఉండదని తెలిపారు. ప్రత్యేక హోదా అంశానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదని సోము వీర్రాజు చెప్పారు.
కావాలంటే....?
ప్రత్యేక హోదా అంశంపై కావాలంటే మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించుకోవచ్చన్నారు. ఈ నెల17వ తేదీన జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశం అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని హోంశాఖ అందుకే తొలగించిందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా కావాలని కోరుకోవడంలో తప్పులేదన్నారు.
Next Story