Mon Nov 25 2024 20:17:27 GMT+0000 (Coordinated Universal Time)
Indrakiladri : దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భవానీలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ గుడికి భవానీలు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భవానీలతో నిండిపోయాయి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ గుడికి భవానీలు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భవానీలతో నిండిపోయాయి. భవానీ దీక్షలను విరమించడానికి ఎక్కువ సంఖ్య భవానీలు చేరుకున్నారు. నిన్నటి నుంచే భవానీలు దుర్గగుడికి భారీ సంఖ్యలో రావడం మొదలు పెట్టారు. నవరాత్రి ఉత్సవాలు నిన్నటి తో ముగిశాయి. నిన్న తెప్పోత్సవంతో శరన్నవరాత్రులు ముగిశాయి. ఉత్తరాంధ్ర నుంచి కాలి నడకన భవానీలు పెద్దయెత్తున తరలి వస్తుండటంతో భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
నిన్నటి నుంచే...
నిన్నటి నుంచే భవానీలు దీక్ష విరమణ కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. మరో రెండు రోజుల పాటు భవానీ భక్తుల రాక ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి గంటల సమయం పడుతుండటంతో ఆలయ అధికారులు క్యూ లైన్ లను కొనసాగిస్తున్నారు. నవరాత్రుల్లో ఏర్పాటు చేసిన క్యూ లైన్లద్వారానే భవానీలు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కృష్ణా నదిలో స్నానం ఆచరించి అనంతరం దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారు.
Next Story