Sun Dec 22 2024 14:29:48 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ను గ్రంధి శ్రీనివాస్ ఇంత మాట అన్నారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ తన వెనక జ్యోతిరావు పూలే, చెగువేరా, మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలను పెట్టారన్న గ్రంధి శ్రీనివాస్ తర్వాత ఆ ఫొటోల స్థానంలో చంద్రబాబు ఫొటో పెట్టారన్నారు. వారి స్థానంలో చంద్రబాబును చూసుకోవాలని పార్టీ నేతలకు, క్యాడర్ కు పవన్ కల్యాణ్ చెబుతున్నారని గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అందరినీ మోసం చేస్తూ తన స్వార్థం కోసం ఎందరినో బలి చేయాలని చూస్తున్నారన్నారు.
మోసం చేయడంలో...
యువతను మోసం చేయడంలో పవన్ కల్యాణ్ దిట్ట అన్న గ్రంధి శ్రీనివాస్ కాపు సోదరులు, పవన్ అభిమానులు ఇప్పుడు చంద్రబాబుకు జై కొట్టాలని చెబుతున్నారన్నారు. చంద్రబాబు కుట్రలకు పవన్ కల్యాణ్ సాయం చేస్తున్నారన్నారు. అంతేకాదు తాను గత ఎన్నికల్లో ఒక పార్టీ అధ్యక్షుడిపై పోటీ చేస్తున్నానని భావించానని, కానీ ఈసారి మాత్రం అలా ఫీల్ కావడం లేదని గ్రంధి శ్రీనివాస్ కామెంట్స్ చేయడం విశేషం. జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గ్రంధి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story