Sun Dec 22 2024 14:06:39 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ను ఎవరైనా చూపించండయ్యా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం వైసీీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం వైసీీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆకు రౌడీలా మాట్లాడుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ కు పిచ్చి బాగా ముదిరినట్లుందని, ఆయనను ఆసుపత్రిలో ఎవరైనా చూపించాంటూ గ్రంధి శ్రీనివాస్ సెటైర్ వేశారు. పవన్ కు పిచ్చి బాగా ముదిరిందన్నారు. పవన్ ఇతర పార్టీల నేతలపై వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. ఇది పిచ్చికి సంబంధించిన లక్షణమని అన్నారు. పవన్ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడని, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్నారు.
ఆయనొక ఆకు రౌడీ...
గతంలో తనను దూషించిన వ్యక్తికే పవన్ ఈసారి టిక్కెట్ ఇచ్చారన్నారు. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని పెట్టి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారని, పవన్ కూడా పార్టీని టీడీపీలో విలీనం చేయాలని ఆయన కోరారు. చిరంజీవి పక్కా కమర్షియల్ అని అన్నారు. ఇప్పుడు తన సినిమా ప్రమోషన్ కోసం పవన్ కల్యాణ్ కు మద్దతిస్తున్నట్లు ఆయన అన్నారు. పార్టీని హోల్సేల్ గా వస్తే ఒకేసారి డబ్బులొస్తాయని, ఇలా విడతల వారీగా డబ్బులు రావాలంటే ఇదే బెటర్ అన్న అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు కనపడుతుందన్నారు. గత ఐదేళ్లలో భీమవరంలో జరిగిన అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story