Fri Dec 20 2024 03:52:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చిలకలూరిపేట వద్ద భూమి పూజ
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారికంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నేడు భూమి పూజ చేయనున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారికంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నేడు భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు కూటమి పార్టీ నేతృత్వంలో చిలకలూరిపేట వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు హాజరుకానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
పదేళ్ల విరామం అనంతరం...
2014 ఎన్నికల తర్వాత అంటే పదేళ్ల విరామం అనంతరం మూడు పార్టీలు కలసి ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం 150 ఎకరాల్లో చిలకలూరి పేట వద్ద ప్రాంగణాన్ని రెడీ చేశారు. పదమూడు కమిటీలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన భూమి పూజ నేడు మూడు పార్టీల నేతలు కలసి చేయనున్నారు. లక్షలాది మంది తరలివస్తుండటంతో ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ ఈ సభ ద్వారా చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story