Mon Dec 23 2024 15:11:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణం అదేనా ?
బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడంతో.. చిత్ర యూనిట్ కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అన్నిఖర్చులు కలిపి..
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, ఆలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ లు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. నిన్న (సెప్టెంబర్ 1) సాయంత్రం జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. రామోజీ ఫిలింసిటీలో భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేసిన తర్వాత.. చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈవెంట్ రద్దయింది.
బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడంతో.. చిత్ర యూనిట్ కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అన్నిఖర్చులు కలిపి ఈవెంట్ కోసం రూ.2 కోట్లకు పైగానే ఖర్చుచేశారట. ఇప్పుడు ఆ రెండు కోట్లు వృథా అయిపోయాయి. అయితే.. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ అని చెప్పడంతో.. ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు, కానీ.. చివరి నిమిషంలో ఈవెంట్ రద్దవడంతో నిరాశకు గురయ్యారు. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఓ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ లో ఫైర్ వర్క్స్, ఎన్టీఆర్, రణబీర్ తో స్పెషల్ ఎఫెక్ట్స్ ప్లాన్ చేశామన్నారు.
అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "ముందుగా అభిమానులందరికి క్షమాపణలు. ఈ బ్రహ్మాస్త్ర ఈవెంట్ ని ఎంతో ఆర్భాటంగా చేద్దాం అనుకున్నాం. దీనికి అన్ని రెడీ చేశారు.కానీ గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీసులంతా బిజీగా ఉండటం వల్ల ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు కూడా మన రక్షణ కోసమే పని చేస్తారు. అందుకే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి. ఈవెంట్ కి వచ్చిన, వద్దామనుకున్న అభిమానులందరికి క్షమాపణలు" చెప్పారు.
Next Story