Mon Dec 23 2024 05:10:41 GMT+0000 (Coordinated Universal Time)
జైలులో భూమా అఖిలప్రియకు అస్వస్థత
అఖిల ప్రియకు చికిత్స నిమిత్తం ఆమెను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు పోలీసులు. మహిళా సబ్ జైల్ లో..
లోకేష్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో.. రెండ్రోజుల క్రితం నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ చేశారు. దాంతో జైలులోనే ఉంటుంది అఖిల ప్రియ. ఈ నేపథ్యంలో ఆమె గత రాత్రి 11.30 గంటల సమయంలో అస్వస్థతకు గురైంది.
అఖిల ప్రియకు చికిత్స నిమిత్తం ఆమెను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు పోలీసులు. మహిళా సబ్ జైల్ లో ఉన్న అఖిలప్రియ.. తనకు ఛాతీలో నొప్పివస్తోందని చెప్పగా.. జైలు సూపరింటెండెంట్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెకు క్యాజువాలిటీలో వైద్యులు ఈసీజీ పరీక్ష నిర్వహించి .. వెంటనే కార్డియాలజీ విభాగానికి పంపారు. అక్కడ కూడా ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేయగా.. అన్ని రిపోర్టులు నార్మల్ గా వచ్చాయి. దాంతో అఖిలప్రియను తిరిగి మహిళా సబ్ జైలుకు తరలించారు.
Next Story