Mon Dec 23 2024 14:26:00 GMT+0000 (Coordinated Universal Time)
భువనేశ్వరి, బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ
చంద్రబాబు నాయుడు అరెస్టు ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఓ వైపు నిరసన కార్యక్రమాలు
చంద్రబాబు నాయుడు అరెస్టు ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఓ వైపు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే..! రాజమండ్రిలో స్థానిక మహిళలతో కలిసి సాయంత్రం 5.30 గంటలకు రాజమండ్రి తిలక్ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ క్యాండిల్ ర్యాలీ కి వివిధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. సెంట్రల్ జైల్లో స్నేహ బారెక్ లో చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం పదిమంది సభ్యులతో కూడిన మెడికల్ టీంను ప్రభుత్వం నియమించింది.
Next Story