Sun Mar 16 2025 23:27:59 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
ఏపీ మాజీ మంత్రి, టిడిపి నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ : ఏపీ మాజీ మంత్రి, టిడిపి నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ జరిగిన పదవ తరగతి పరీక్షల్లో వరుసగా.. ప్రశ్నా పత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఆయా ఘటనల్లో పలువురు టీచర్లను అరెస్ట్ చేయగా.. వారంతా నారాయణ విద్యాసంస్థలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. సీఎం జగన్ కూడా కొద్దిరోజుల క్రితం తిరుపతిలో జరిగిన సభలో.. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల హస్తం ఉన్నట్లు ఆరోపించారు.
దాంతో ఇప్పుడు నారాయణను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న నారాయణ నివాసానికి వెళ్లి సీఐడీ పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story