Thu Dec 19 2024 16:04:52 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగురాష్ట్రాల్లో అతిపెద్ద వినాయక విగ్రహం ఇదే !
ఈ ఏడాది తెలుగురాష్ట్రాల్లోకెల్లా దొండపర్తిలో వైఎస్ జగన్ యువసేన 102 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. వినాయక నవరాత్రుల్లో తొలిరోజు లంబోదరుడు ఘనంగా పూజలందుకున్నాడు. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి.. తమ కోరికలు తీర్చాలని, చేసే ప్రతిపనిలో విఘ్నాలు లేకుండా చూడాలని భక్తులు ప్రార్థించారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వినాయకచవితి సందర్భంగా చలువ పందిళ్లు వేసి.. ఒకరిని మించి ఒకరు ఎత్తైన విగ్రహం పెట్టాలని పోటీపడుతుంటారు.
ఈ ఏడాది తెలుగురాష్ట్రాల్లోకెల్లా దొండపర్తిలో వైఎస్ జగన్ యువసేన 102 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం మొత్తం మట్టితోనే తయారు చేయడం విశేషం. 102 అడుగుల భారీ విగ్రహంతో పాటు.. 102 కిలోల లడ్డూని కూడా ఉంచారు. దొండపర్తి వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో.. క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 21 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
Next Story