Fri Nov 22 2024 17:28:56 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
ప్రధాని మోదీ హత్యకు పన్నిన కుట్రను బీహార్ పోలీసులు భగ్నం చేశారు
ప్రధాని మోదీ హత్యకు పన్నిన కుట్రను బీహార్ పోలీసులు భగ్నం చేశారు. ఈ నెల 12న మోదీ బీహార్ పర్యటన సందర్బంగా ఆయనను హత్య చేయడానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జలావుద్దీన్, అథర్ పర్వేజ్ గా గుర్తించారు. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2047 నాటికి భారత్ ను ఇస్తామిక్ దేశంగా మార్చాలన్న కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే వీరు మోదీ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు.
బీహార్ పర్యటనలో...
అరెస్టయిన ఇద్దరికీ పీఎఫ్ఐతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రధాని మోదీ పర్యటనకు ముందు నుంచే కుట్రకు ప్లాన్ చేశారు. 15 రోజులు ముందుగా వీరు పుల్వారీ షరీఫ్ శిక్షణ పొందారని పోలీసులు తెలిపారు. పుల్వారీ షరీఫ్ కార్యాలయంలో దాడులు నిర్వహించగా అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కరపత్రాలు కూడా అక్కడ లభ్యమయ్యాయి. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు.
Next Story