బీజేపీని గట్టెంకించనున్న వైసీపీ
పార్లమెంటులో పలు బిల్లులు ముందుకు వెళ్లడానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని
పార్లమెంటులో పలు బిల్లులు ముందుకు వెళ్లడానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలో సేవల నియంత్రణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటు ఉభయసభలను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. రాజ్యసభలో తొమ్మిది మంది, లోక్సభలో 22 మంది సభ్యులున్న వైసీపీ కీలకమైన బిల్లులపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. ఢిల్లీలో బ్యూరోక్రసీపై కేంద్రం నియంత్రణ ఉండేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన బిల్లు ముసాయిదాను మే 19న కేంద్రం కేబినెట్ ఆమోదించింది. పోలీసు, పబ్లిక్ ఆర్డర్, భూమికి సంబంధించిన విషయాలు మినహా రాజధానిలో బ్యూరోక్రసీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాన్ని సమర్థిస్తూ సవరణ బిల్లు సిద్ధం చేసింది. దాన్ని వచ్చే వారం ఆమోదానికి సభ ముందు పెట్టబోతోంది. లోక్ సభలో భారతీయ జనతా పార్టీకి ఈ బిల్లును పాస్ చేయడానికి సంపూర్ణ మద్దతు ఉండగా.. రాజ్యసభలో వైసీపీ నేతల ఓటింగ్ కీలకం కానుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది.