Mon Dec 23 2024 08:06:22 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. మెగాస్టార్ చేసిన ట్వీట్ ఇదే
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ ను మొదలుపెట్టారు. ఇక మెగా స్టార్ చిరంజీవి తన తమ్ముడి గురించి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
“Dearest Kalyan Babu, జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐 Happy Birthday Dearest brother @PawanKalyan ! 💐💐 May you have a wonderful year ahead!”
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు జిల్లా రైతులు వెరైటీగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభిమాన నేతకు పచ్చనైన వరి నారు తో శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ రైతులు వరి నారు తో జనసేన పార్టీ గుర్తును ఏర్పాటు చేసి పవన్ కోసం అత్తోట కౌలు రైతులు అని వరినారుతో పంట పొలంలో క్యాప్షన్ పెట్టి మరి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ శిబిరాన్ని ప్రారంభించి రక్త దానం చేశారు. పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
Next Story