Sun Dec 22 2024 22:44:27 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేడు రాజమండ్రికి పురంద్రీశ్వరి.. ఎన్నికల ప్రచారాన్ని
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాజమండ్రి నుంచి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పురంద్రీశ్వరి ఈసారి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆమె అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
గెలిపించాలని...
ఎన్టీఆర్ కుమార్తెగానే కాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆమె ఎలాగైనా రాజమండ్రిలో గెలుపు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం నేటి నుంచిఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story