Thu Dec 19 2024 17:42:32 GMT+0000 (Coordinated Universal Time)
జిన్నా టవర్ పేరు మార్చాల్సిందే.. ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్
గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేసేందుకు..
గుంటూరు లోని జిన్నా టవర్ పేరు వివాదం మరో సారి వార్తల్లో నిలిచింది. గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో జిన్నా టవర్ పేరు మార్చాలంటూ దూసుకెళ్లారు బీజేవైఎం కార్యకర్తలు. జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ, ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో బీజేపీ కీలక నేతలు, సునీల్ దియోధర్, సత్యకుమార్ పాల్గొన్నారు. వీరిని అడ్డుకున్నారు పోలీసులు. అనంతరం స్టేషన్ కు తరలించారు. పోలీసులు అడ్డుకోవడంతో, రోడ్డుపై బైఠాయించిన నినాదాలు చేశారు బీజేవైఎం కార్యకర్తలు. జిన్నా టవర్ మార్చి, అబ్దుల్కలాం పేరు పెట్టాలని నినాదాలు చేశారు. పేరు మార్చకపోతే ఆగస్టు15కి జిన్నాటవర్ కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ యువజన విభాగం BJYM సమావేశం తరువాత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జిన్నా టవర్ వద్ద నిరసన ప్రదర్శనను చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. చారిత్రాత్మకమైన జిన్నా టవర్ పేరు మార్చాలని గత కొన్ని నెలలుగా బీజేపీ, ఇతర హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
మంగళవారం.. బీజేపీ రాష్ట్ర పార్టీ కో-ఇన్చార్జి సునీల్ దేవధర్ గుంటూరుకు చేరుకున్నారు. జిన్నా టవర్ పేరును ఏపీజే అబ్దుల్ కలాం టవర్ గా మార్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. తమ పార్టీ నేతలను పోలీసులు నిర్బంధించడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. 'మనం ఏపీలో ఉన్నామా, పాకిస్థాన్లో ఉన్నామా' అని ట్వీట్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ టవర్ పేరు మార్చాలని తమ పార్టీ మాత్రమే కాకుండా ప్రజలు కూడా కోరుతున్నారు.
"జిన్నా టవర్ పేరును డా..ఏపీజే అబ్దుల్ కలాం టవర్ గా మార్చాలనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ కు ప్రజల నుండి కూడా మద్దతు లభిస్తుంది.ఒక దేశ ద్రోహి పేరును తుడిచి వేయాలనే మా అభ్యర్ధనపై రాష్ట్ర ప్రభుత్వ అనిచివేత వైఖరి తగదు. పోలీసు బలగాల ద్వారా మా సంకల్పాన్ని నిలువరించలేరు.@ysjagan గారు." అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
Next Story