Wed Jan 08 2025 16:31:40 GMT+0000 (Coordinated Universal Time)
ఉప ఎన్నికకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే
ఆత్మకూరు ఉప ఎన్నికకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. సోము వీర్రాజు అక్కడే ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు
ఆత్మకూరు ఉప ఎన్నికకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. సోము వీర్రాజు ఆత్మకూరులోనే ఉండి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి ప్రచారం 90 శాతం పూర్తయిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి సునీల్ దేవ్‌ధర్ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే కొత్తగా స్టార్ క్యాంపెయినర్లతో ఆత్మకూరులో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
ప్రచారం ఇలా.....
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంద్రేశ్వరి ఈనెల 18, 19 తేదీల్లో, నటి జయప్రద 19వ తేదీన ప్రచారం నిర్వహించనున్నారు. 19, 20వ తేదీల్లో జాతీయ కార్యదర్శి సత్యకుామర్, 19, 20 తేదీల్లో సీఎం రమేష్ లు ఆత్మకూరు ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 17,18వ తేదీల్లోనూ, కేంద్ర మంత్రి ఎల్.మురగన్ 20వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
Next Story