Mon Dec 16 2024 18:49:19 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ నిరసన
ఆంధ్రప్రదేశ్ లో నేడు బీజేపీ అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు బీజేపీ అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ల ముందు నిరసన తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపు నిచ్చారు. హిందువులు, హిందూ ఆలయాలంటే ప్రభుత్వానికి అంత అలుసా? అని ఆయన ప్రశ్నించారు.
వసతి గదుల అద్దె....
తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి గదుల అద్దె పంపు నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని, శ్రీశైలంలో దేవస్థానం ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల సరఫరా కాంట్రాక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని, దేవాదాయ శాఖ జోక్యం చేసుకోవాలని కోరుతుందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
Next Story