Mon Dec 23 2024 11:49:19 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ పేరు మార్చడంపై సోము ఆగ్రహం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యతిరేకించారు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దీనిని వ్యతిరేకించారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానని మంటకలపడమేనని అన్నారు. ఏపీలోని వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నార. ఆయన పేరు హెల్త్ యూనివర్సిటీకి తర్వాత ప్రభుత్వం పెట్టిందని, దానిని తొలగించడం సరికాదని సోము వీర్రాజు అన్నారు.
అందుకే వ్యతిరేకిస్తున్నాం...
ప్రభుత్వం కుట్రపూరితంగా దొడ్డిదారిన ఎన్టీఆర్ పేరు తొలగించిందని సోము వీర్రాజు అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించడంపై తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు.
Next Story