Mon Dec 23 2024 09:37:10 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ గురించి కన్నా ఏమన్నారంటే?
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనను బయట నుంచి ఎవరూ ప్రభావితం చేయవద్దని ఆయన సూచించారు
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనను బయట నుంచి ఎవరూ ప్రభావితం చేయవద్దని ఆయన సూచించారు. పవన్ నిర్ణయాన్ని ఆయనకే వదిలేయాలన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకున్నది ఆయనే నిర్ణయించుకుంటాడని తెలిపారు. ఎన్నికల సమయంలో కాపులను ఓట్ల కోసం వాడుకుంటున్నారన్నారు. కాపులను ఎన్నికల కోసం వాడుకుని తర్వాత వదిలేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు.
కాపు రిజర్వేషన్ల అంశం...
కాపు రిజర్వేషన్ల అంశం వైఎస్ హయాంలో బయటకు వచ్చిందన్నారు. చంద్రబాబు పాలనలో దానికి న్యాయం చేశారన్నారు. కాపులకు ఏం సాధించారని సన్మానాలు చేయించుకుంటారని అధికార పార్టీపై కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. కాపులకు న్యాయం జరిగింది వైఎస్, చంద్రబాబు హయాంలోనేనని ఆయన అన్నారు.
Next Story