Sun Dec 22 2024 21:21:44 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీపై చిన్నమ్మ ఫైర్
బీజేపీ సీనియర్ నేత పురంద్రీశ్వరి వైసీపీ పాలనపై ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో మాఫియాల ద్వారా దోపిడీ జరుగుతుందన్నారు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంద్రీశ్వరి వైసీపీ పాలనపై ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో మాఫియాల ద్వారా దోపిడీ జరుగుతుందన్నారు. గడిచిన మూడేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టి, ఎంత ఉత్పత్తిని సాధించారో చెప్పాలని పురంద్రీశ్వరి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలగా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.
కేంద్ర పథకాలన్నీ....
జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మాణమవుతున్నవి కేంద్ర ప్రభుత్వం నిధులతోనేనని ఆమె తెలిపారు. రాష్ట్రా వాటా నిధులు జమకాక పోవడంతో అనేక కేంద్ర పథకాలు ఇంకా మొదలుకాలేదన్నారు. ప్రజల్లో వైసీపీ పాలనపై వ్యతిరేకత మొదలయిందని, గడప గడప కు ప్రభుత్వం, వైసీపీ బస్సు యాత్రలో ఈ వ్యతిరేకత బయటపడిందని పురంద్రీశ్వరి తెలిపారు. ఒక్క అవకాశం అంటూ జగన్ ప్రజలను ఆకట్టుకున్నారని, అందుకనే అధికారంలోకి రాగలిగారన్నారు. ఈసారి బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని పురంద్రీశ్వరి తెలిపారు.
Next Story