Sun Dec 22 2024 01:13:01 GMT+0000 (Coordinated Universal Time)
Lokesh : లోకేష్ తో సుజనా చౌదరి భేటీ.. ఆ ముగ్గురి కోసమే
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కలిశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కలిశారు. హైదరాబాద్ లో లోకేష్ నివాసానికి వచ్చిన సుజనా చౌదరి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. సుజనా చౌదరి ఈ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయనకు బీజేపీ టిక్కట్ ఇచ్చింది. అయితే ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీల్లో అసంతృప్త నేతలున్నారు.
అసంతృప్తులను...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అసంతృప్తితో ఉన్నారు. అలాగే జనసేన నుంచి టిక్కెట్ ను ఆశించిన పోతిన మహేష్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా కొంత అసహనంతో ఉన్నారు. దీంతో వీరిని పిలిచి మాట్లాడి తన గెలుపునకు సహకరించాలని లోకేష్ ను సుజనా చౌదరిని కోరినట్లు తెలిసింది.
Next Story