Sun Dec 22 2024 22:07:34 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ సర్కార్‌పై పురంద్రీశ్వరి ఆగ్రహం
వైసీపీ ప్రభుత్వం పై బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైసీపీ ప్రభుత్వం పై బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి ఆగ్రహం వ్యక్తంచేశారు. యువతకు ఉపాధి లేకుండా చేసిందని అన్నారు. .రాష్ట్రంలో విధ్వంసకర, విద్వేషపూరిత, కక్షపూరిత పరిపాలన సాగుతున్నడంతో... ఒక పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదన్న పురంద్రీశ్వరి ఈ తరుణంలో ఇక్కడ పిల్లలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో, గ్రామాల్లో అంతర్గత రహదారులు బాగుండలేదని కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులు మాత్రమే సవ్యంగా, బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కనీసం రోడ్ల నిర్మాణం కూడా చేయలేని దుస్థితిలో ఉందన్నారు.
టిడ్కో ఇళ్లను...
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకుండా రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులు కూడా ప్రభుత్వం మోసం చేసిందని పురంద్రీశ్రి అన్నారు. రాష్ట్రంలో ఆక్వారైతులను కూడా మభ్యపెట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మద్యపానం నిషేధం అని చెప్పి నేడు అధిక రేట్లకు మద్యాన్ని పారిస్తున్నారన్నారు. మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం ప్రకటిస్తామని, ఎలక్షన్ కు ముందు ఈ విషయాన్ని తీసుకువచ్చారన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఒక డీఎస్సీ పోస్ట్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన విషయాన్ని యువత గుర్తిస్తున్నారు.
Next Story