Mon Dec 23 2024 03:21:21 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ, వైసీపీపై సోము ఫైర్
ఏపీలో రెండు కుటుంబ రాజకీయ పార్టీలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రెండు కుటుంబ రాజకీయ పార్టీలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రెండు పార్టీలు కలసి ఏపీలో బీజేపీని రాకుండా అడ్డుకంటున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించిందని, 7,798 కోట్ల రూపాయలను తీసుకుని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతగా లేఖ రాసిన విషయం సోము వీర్రాజు గుర్తు చేశారు. ఆ పార్టీకి చెందిన ఎంపీయే మళ్లీ పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు.
ప్రత్యేక హోదాపై...
ఇక జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటారన్నారు. టీడీపీ, వైసీపీలు ప్రత్యేక హోదాపై గూడు పుఠాణి ఆడుతున్నాయని సోము వీర్రాజు అన్నారు. దమ్ముంటే మోదీని విమర్శించాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. ఇసుక, మద్యం, మట్టి మాఫియాలను ప్రోత్సహిస్తూ ఆ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. పోలవరం పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ ఎదగనివ్వకూడదనే ఆ రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయన్నారు.
Next Story