Thu Mar 20 2025 23:29:11 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం రమేష్ కు వైసీపీ ఎంపీ కౌంటర్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్ కు వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరగడం లేదని ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. అంత ఘోరమైన పరిస్థితులు రాష్ట్రంలో లేవని, శాంతిభద్రతలు సవ్యంగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
చూసేవారి మనసును బట్టి....
చూసేవారి మనసును బట్టి పరిస్థితులు కనపడతాయని ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కోవిడ్ సమయంలోనూ ముఖ్యమంత్రి జగన్ పేదలకు అండగా నిలిచారని ఆయన చెప్పారు. జగన్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని, సీఎం రమేష్ కు ఏవైనా ఇబ్బందులుంటే చెప్పవచ్చని ఆయన అన్నారు.
Next Story