Fri Dec 20 2024 12:12:54 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీపై సానుకూలత లేదు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పై ప్రజల్లో సానుకూలత లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పై ప్రజల్లో సానుకూలత లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని అన్నారు. ప్రత్యామ్నాయం ప్రతిపక్షం కాదని, కొత్త ప్రత్యామ్యాయాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. జనసేన తమతో కలసి పోటీ చేస్తుందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
వైసీపీ పాలనతో...
వైసీపీ పాలనతో ప్రజలు విసిగెత్తి పోయి ఉన్నారని అన్నారు. అలాగే ప్రతిపక్షం టీడీపీని కూడా ఎవరూ నమ్మడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. బీజేపీ రాష్ట్రంలో బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు పార్టీ అధినాయకత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు ఆ రెండు పార్టీలను నమ్మడం లేదన్నారు. కుటుంబ పార్టీలుగా ముద్రపడిన ఆ పార్టీలను ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Next Story