Mon Dec 23 2024 13:15:44 GMT+0000 (Coordinated Universal Time)
వీరిద్దరితోనే అమిత్ షా స్పెషల్ మీటింగ్... అందుకేనట
ధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు అమిత్ షాను కలిశారు
తిరుపతిలో ఉన్న అమిత్ షా ఈరోజు పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు అమిత్ షాను కలిశారు. అమిత్ షా వారిని తన వద్దకు ప్రత్యేకంగా పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునే ప్రయత్నం చేశారంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలతో పాటు పార్టీ పరిస్థితిపై కూడా అమిత్ షా వారితో చర్చించినట్లు సమాచారం.
పార్టీ స్థానిక నాయకత్వంపై...?
ఇటీవలే పార్టీ కో ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ టీడీపీతో పొత్తు ఉండదని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిని సీఎం రమేష్ ఖండించారు కూడా. ఈ సందర్బంగా అమిత్ షా దృష్టికి సుజనా చౌదరి, సీఎం రమేష్ లు సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై అమిత్ షా వీరిరువరితో చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక నాయకత్వంపై వీరిద్దరూ అమిత్ షాకు ఫిర్యాదు చేశారని సమాచారం.
Next Story