Mon Dec 23 2024 14:11:33 GMT+0000 (Coordinated Universal Time)
నిన్నటి ఘటన సిగ్గు చేటు
అసెంబ్లీ లో కుటుంబ సభ్యుల ప్రస్తావన తేవడం దురదృష్టకరమని బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు.
అసెంబ్లీ లో కుటుంబ సభ్యుల ప్రస్తావన తేవడం దురదృష్టకరమని బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. నిన్న జరిగిన ఘటనకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడుతున్నారన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా కొందరు ప్రవర్తిస్తున్నారని సీఎం రమేష్ అన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యుల ప్రస్తావన సభలో తేవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
జయలలిత కూడా...
కుప్పం పక్కనే ఉన్న నియోజకవర్గంలో అప్పట్లో జయలలిత ఓడిపోయారని, ఆమె తిరిగి గెలిచి అధికారంలోకి వచ్చారని సీఎం రమేష్ గుర్తు చేశారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని ఆయన అన్నారు. వరదలు ముంచెత్తినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీజేపీ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story