Sun Dec 22 2024 22:28:33 GMT+0000 (Coordinated Universal Time)
BJP : పేద ప్రజలను దగా చేసింది వైసీపీ
పేద ప్రజల ను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి అన్నారు
పేద ప్రజల ను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి అన్నారు. రుషి కొండ ను బోడి కొండ గా మార్చారన్నారు. పేదలకు ఇళ్లు పేరు తో టిడ్కో ఇళ్ళ పై వైసీపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే బ్యాంకు లనుండి నోటీసు లు వస్తున్నాయని, అంటే వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల ను పచ్చిమోసం చేస్తోందని మండిపడ్డారు. వారి కి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని అన్నారు. రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమేనని అన్నారు. ప్రజల పక్షాన బిజెపి మాత్రమే నిలబడిందని తెలిపారు.
స్థలం కూడా...
రైల్వే జోన్ కార్యకలాపాలు కు కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా బీజేపీ పై బురద జల్లే ప్రయత్నం ఏంటని ప్రశ్నించారు. సంస్థాగతంగా పటిష్టం చేయడానికి పర్యటన సాగుతోందన్నారు. ఇప్పటి వరకు ఇరవై జిల్లా లు పూర్తి చేశానని, రాజకీయ స్థితి గతులు అధ్యయనం కేంద్రం చేస్తున్న అభివృద్ధి ని ప్రజలకు చెబుతూ ధైర్యం గా వెళుతున్న ఏకైక పార్టీ బిజెపి కేంద్రం ఆర్థిక సహకారాన్ని జిల్లా కు నిధులు ఇచ్చామని తెలిపారు. విశాఖ లో ఇఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి సమీక్ష నిర్వహించామని తెలిపారు. "బిజెపి తో విశాఖ కు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.
Next Story