Mon Dec 23 2024 08:03:10 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు తమతో ఉంటే గెలిచే వాళ్లం... సోము వ్యాఖ్యలు
చంద్రబాబు రాజధాని కట్టి ఉంటే ఇలా అయ్యేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు
చంద్రబాబు రాజధాని కట్టి ఉంటే ఇలా అయ్యేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు తమను విడిచిపెట్టకుండా ఉంటే జగన్ గెలిచే వాడు కాదని సోము వీర్రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల్లో బీజేపీ పాదయాత్రను ప్రారంభించిన సోము వీర్రాజు అనంతరం ముఖ్యులతో కలసి బయలుదేరారు. మనం - మన అమరావతి పేరుతో పాదయాత్రను చేస్తున్నారు. అయితే కొందరు రైతులు సోము వీర్రాజును అడ్డుకున్నారు. బీజేపీ, జగన్ ఒకటేనని ఆయన పేర్కొనడంతో కొంత గందరగోళం నెలకొంది. మొత్తం 29 గ్రామాల్లో బీజేపీ పాదయాత్ర చేపట్టింది.
ఒకే రాజధాని....
తాము ఏం తప్పు చేశామని చంద్రబాబు తమను వదిలేశాడని సోము వీర్రాజు ప్రశ్నించారు. అమరావతికి మోదీ శంకుస్థాపన చేసి వెళ్లాడని, అప్పటి నుంచి కలలు కంటున్నామని రైతులు పేర్కొన్నారు. రాజధాని ఒక నినాదమా? ఏదైనా చేస్తారా? అని రైతులు సోము వీర్రాజును ప్రశ్నించారు. అయితే రాజధాని నిర్మాణం కోసం 8,500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. జగన్ వచ్చి మూడు రాజధానులు అంటున్నాడని రైతులు గుర్తు చేశారు. ఒకే రాజధాని అన్నది తమ విధానమని సోము వీర్రాజు రైతులకు సర్దిచెప్పే ప్రయ్నతం చేశారు.
Next Story