Sat Apr 12 2025 08:07:45 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తనను తాను నిర్బంధించుకున్నట్లే
ఏపీ ఉద్యోగుల నిర్బంధంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ఉద్యోగుల నిర్బంధంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తుందని సోము వీర్రాజు ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇచ్చి వారిని చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని సోము తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలను నిర్బంధించడమంటే జగన్ తనను తాను నిర్భంధించుకోవడమేనని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.
ఆదాయం పెంచుకోలేక...
ప్రభుత్వ ఉద్యోగులు నెలల పాటు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేక సమ్మెకు వెళుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సోము వీర్రాజు కోరారు. ప్రభుత్వాన్ని అప్పుల్లోకి నెట్టిన జగన్ ఇప్పటికైనా రాష్ట్ర మూలధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని సోము వీర్రాజు హితవు పలికారు. ఆదాయం పెంచుకునేందుకు కూడా జగన్ వద్ద ఎలాంటి ఆలోచనలు లేవని అర్థమవుతుందని సోము అన్నారు. వివిధ రూపాల్లో దోచుకుంటున్న వైసీపీని పక్కన పెట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని సోము వీర్రాజు అన్నారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story