Mon Dec 23 2024 02:34:30 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులపై సోము ఫైర్
అమలాపురం వెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
అమలాపురం వెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తన వాహనాన్ని ఎందుకు ఆపుతున్నారని సోము వీర్రాజు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అక్కడకు వెళ్లకూడదని పోలీసులు అభ్యంతరం తెలిపారు. జొన్నాడ జంక్షన్ లో సోము వీర్రాజు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎస్ఐ పై సోము వీర్రాజు చేయి చేసుకున్నారు.
జొన్నాడ వద్ద....
అమలాపురం ప్రాంతంలో తమ పార్టీ ఎస్సీ సెల్ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి సోము వీర్రాజు బయలుదేరి వెళుతున్నారు. అయితే అమలాపురంలో ఉద్రిక్తత నెలకొన్న దృష్ట్యా అక్కడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పక్కన నేతలు అడ్డుకుంటున్నా సోము వీర్రాజు ఎస్ఐని నెట్టివేయడంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. తాను ఎస్పీ అనుమతి తీసుకున్నానని చెబుతున్నప్పటికీ పోలీసులు జొన్నాడ వద్ద సోము వీర్రాజు కారుకు పెద్ద వాహనాన్ని అడ్డంపెట్టి నిలిపివేశారు.
Next Story