Sun Dec 22 2024 01:09:17 GMT+0000 (Coordinated Universal Time)
ఎప్పటికీ నా రాజకీయ గురువు చంద్రబాబే : సుజనా చౌదరి
తన రాజకీయ గురువు ఎప్పటికీ చంద్రబాబు అని బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు
తన రాజకీయ గురువు ఎప్పటికీ చంద్రబాబు అని బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మూడు పార్టీల నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ తనకు దైవ సమానుడు చంద్రబాబు అని అన్నారు. ఎప్పటికీ తన రాజకీయ గురువు ఆయనేనని అన్నారు. తాను దివంగత అరుణ్ జైట్లో సలహాతోనే తాను బీజేపీలోకి వెళ్లానని సుజనా చౌదరి అన్నారు. తనను ప్రాంతీయ పార్టీలు సెట్ కావని, జాతీయ పార్టీలోకి వెళ్లాలని ఉందని జైట్లీతో చెప్పానని... దాంతో, ఆయన బీజేపీలోకి రమ్మన్నారని తెలిపారు.
పవన్ వల్లనే పొత్తు...
బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు కుదర్చడంలో జనసేనాని పవన్ కల్యాణ్ పట్టువదల వదలని విక్రమార్కుడిలా పోరాడారని సుజనా చౌదరి ప్రశంసించారు. ఏపీ ప్రజల కోసం ఆయన త్యాగమూర్తిలా మారారని చెప్పారు. సొంత అన్నయ్య నాగబాబు టికెట్ ను కూడా పొత్తు కోసం త్యాగం చేశారని అన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుజనా స్పందిస్తూ... మహేశ్ ఏం మాట్లాడినా ఎవరూ స్పందించవద్దని జనసేన శ్రేణులకు సూచించారు. ఆయన స్థాయికి మనం వెళ్లొద్దని, ఆయనను దుర్భాషలాడొద్దని, మన గ్రాఫ్ పెంచుకుంటూ పోదామని అన్నారు.
Next Story