Thu Dec 19 2024 17:57:29 GMT+0000 (Coordinated Universal Time)
ఆ జీవి గుండె కారు పరిమాణం.. శ్రీకాకుళంలోకి వచ్చింది
ప్రపంచంలోనే అతి పెద్ద జీవి ఏమిటంటే నీలి తిమింగలం అని చెబుతారు. బాగా ఎదిగిన తిమింగలం బరువు
ప్రపంచంలోనే అతి పెద్ద జీవి ఏమిటంటే నీలి తిమింగలం అని చెబుతారు. బాగా ఎదిగిన తిమింగలం బరువు 200 టన్నులు ఉంటుంది. అంటే సుమారు 33 ఏనుగుల బరువు ఉంటుంది. దీని గుండె చిన్న కారు పరిమాణంలో ఉంటుంది. ఈ నీలి తిమింగలాలు భూమిపై అత్యంత బిగ్గరగా అరిచే జంతువులుగా పరిగణిస్తారు. వీటి అరుపులు వందల మైళ్ల వరకు వినబడుతుంది. అలాంటి నీలి తిమింగలం పిల్ల ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చింది.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం కొట్టుకొచ్చింది. ఇది సుమారు 25 అడుగుల పొడవు, ఐదు టన్నుల వరకు బరువు ఉంటుందని అంటున్నారు. ఈ నీలి తిమంగలాన్ని బ్లూ వేల్ అంటారని.. ఇవి బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని అన్నారు. లోతులేని ప్రాంతంలో చేరి చనిపోయి ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. ఇంతవరకు ఇలాంటి తిమంగలాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఇది పిల్ల తిమింగలంగా అనుమానిస్తున్నారు. స్థానికులు, మత్స్యశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు బీచ్ కు వచ్చారు. చాలా మంది సెల్ఫీలు దిగుతున్నారు.
Next Story