Sun Dec 22 2024 16:21:19 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపులు
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. లీలా మహల్ సెంటర్ లోని మూడు హోటళ్లకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. మరో హోటల్ కు కూడా మెయిల్ లో బెదిరింపులు రావడంతో హోటల్స్ యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమయిన పోలీసులు హోటళ్లలో తనిఖీలను నిర్వహించారు.
తనిఖీల తర్వాత...
ఈ మెయిల్ లో తమిళనాడులో ఉగ్రవాది జాఫర్ సాదిక్ కు శిక్షపడిందని, ఆ శిక్ష పడేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ సహకరించారని, అదుకే ఐఎస్ఐ పేలుళ్లకు ప్రయత్నిస్తుందని, ఇందులో సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని పాఠశాలలకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని ఈ మెయిల్ లో పేర్కొన్ారు. దీంతో వెంటనే తిరుపతిలోని హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు. అయితే ఏవీ అనుమానాస్పద వస్తువులు కనిపించడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story