Mon Dec 23 2024 12:53:10 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నన్ను ఆ కేసులో ఇరికిస్తున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో తనను ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో తనను ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు. పోలీస్ కమిషనర్ నిన్న రాత్రి తన కార్యాలయం ముట్టడికి వందలాది మంది పోలీసులను పంపించారని అన్నారు. తాను నామినేషన్ వేసిన సమయంలో తనపై కేసులు పెడుతూ వేధింపులకు గురిచేయడమే కాకుండా, తన అనుచరులను భయభ్రాంతులకు గురి చేలా పోలీసుల చర్యలున్నాయని బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
తనను ఏ1గా పెట్టినా...
తమకు సెంట్రల్ నియోజకవర్గంలోకి వచ్చిన వైఎస్ జగన్ పై రాయి దాడి చేయించాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది తమకు ఎన్నికల్లో నష్టం కలిగిస్తుందన్న సంగతి తమకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. తనపై క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఈ కేసులో తనను ఏ1గా పెట్టినా ఆశ్చర్యం లేదన్నారు. పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా వ్యవహారశైలిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశామన్న బొండా ఉమామహేశ్వరరావు ఈ దాడికేసులో తనను ఇరికిస్తే అందుకు ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు.
Next Story