Sun Dec 22 2024 08:30:08 GMT+0000 (Coordinated Universal Time)
50 మంది మాతో టచ్లో ఉన్నారు: బొండా ఉమ
తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమ రాబోయే ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమ రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను, విజయనగరంలో ఆయన తమ్ముళ్లు, కుటుంబ సభ్యులను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నుండి బొత్స కుటుంబ సభ్యులు సహా యాబై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి అంత నమ్మకం ఉంటే ఉగాది వరకు కాదని, ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నాటికి టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని సవాల్ చేశారు. శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన టీడీపీ, జనసేన పార్టీలకు లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు స్కీములు గుర్తుకు వస్తాయని.. కొంతమంది నేతలు మాట్లాడితే చేతులు, కాళ్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ విధానం ఏమిటి, పార్టీ ఏమిటి అంటే జనసేనాని వద్ద సమాధానం లేదన్నారు. రాజకీయ దుకాణం తెరిచి పదిహేనేళ్లయిందని ఎద్దేవా చేశారు.
Next Story