Thu Dec 19 2024 13:06:03 GMT+0000 (Coordinated Universal Time)
జీతాలు కూడా ఎప్పుడిస్తారో చెప్పలేరా?
ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వస్తాయని ప్రభుత్వం చెప్పలేకపోతోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వస్తాయని ప్రభుత్వం చెప్పలేకపోతోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు. జీతాల లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని బొప్పరాజు వెంకేటశ్వర్లు డిమాండ్ చేశారు..తొలి దశ ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించనందున మరలా ఉద్యమం బాట పట్టామన్నారు.
రెండో దశ ఉద్యమం...
విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయీల్లో ఎంత చెల్లించారో లెక్క చెప్పలేనంత స్థితిలో ప్రభుత్వం ఉందని బొప్పరాజు ఆరోపించారు. చట్ట బద్దంగా ఉద్యోగులకు రావాల్సిన డి.ఏ లు ఎంత రావాలో చెప్పడం లేదని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వస్తాయని ప్రభుత్వం చెప్పలేక పోవడం విచారకరమని అని అన్నారు.
Next Story